
ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీకి చెందిన ఐదుగురు సాయుధులైన మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. పూసపల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం వీరంతా సమావేశమయ్యారనే సమాచారంతో పోలీసులు సోదా చేశారు. ఆ సమయంలో సాయుధులైన కొందరు పారిపోతుండగా వారిలో ఐదుగురుని పట్టుకున్నారు. అరెస్టు అయిన వారిలో స్టేట్ కమిటీ సెక్రటరీ కురసం వంజయ్య అలియాస్ అశోక్, సభ్యులు సమ్మయ్య, ముత్తయ్య, సాహెబ్, సురేశ్ ఉన్నారు. నిందితుల నుంచి పిస్టల్, 5 జిలెటిన్ స్టిక్స్, 4 కిట్ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారని ఎస్పీ రోహిత్ రాజ్ మీడియా సమావేశంలో వెల్లడించారు….
