రేషన్ బియ్యం మాయం కేసు.. అజ్ఞాతంలో పేర్ని నాని కుటుంబం
నాని సొంత గోదాము నుంచి 185 టన్నుల రేషన్ బియ్యం మాయం
కేసు నమోదైనప్పటి నుంచి కనిపించకుండా పోయిన నాని కుటుంబం
గోదాము మేనేజర్ మానస్ తేజ కూడా అజ్ఞాతంలోనే
అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ నాని భార్య బెయిలు పిటిషన్
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. సొంత గోదాము నుంచి 185 టన్నుల రేషన్ బియ్యం మాయమైన కేసులో తమ చుట్టూ ఉచ్చు బిగుస్తుండటంతో అరెస్ట్ తప్పదని భావించిన నాని, ఆయన భార్య జయసుధ ఇద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలిసింది. రేషన్ బియ్యం మాయం కావడంపై కేసు నమోదు కాగానే నాని కుటుంబంతోపాటు గోదాము మేనేజర్ మానస్‌తేజ కూడా కనిపించడం లేదు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ జయసుధ నిన్న మచిలీపట్నం జిల్లా కోర్టులో ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేశారు.
మరోవైపు, పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు నిన్న కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడి హోదాలో నాని నేతృత్వం వహించాల్సి ఉండగా ఆయన కానీ, ఆయన కుమారుడు పేర్ని కిట్టు కానీ కనిపించకపోవడంతో అజ్ఞాతం వార్తలకు మరింత బలం చేకూరింది. కాగా, బియ్యం మాయం వ్యవహారంపై పౌరసరఫరాలశాఖ అధికారులు సమగ్ర విచారణ చేస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App