నవంబర్ 16, 2026
TRINETHRAM NEWS
New Sub-Collector.

ఎం కే ఆర్ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం .

New Sub-Collector : దేవరకొండ డివిజన్ అక్టోబర్ 26, త్రినేత్రం న్యూస్. దేవరకొండ నూతన సబ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కరోలిన్ చింగ్ థియాన్ మావిని మునగాల కొండలరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), దేవరకొండ ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం సోమవారంమర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రమావత్ రవి ఆధ్వర్యంలో అధ్యాపక బృందం సబ్‌ కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు. అనంతరం కళాశాలలో త్వరలో నిర్వహించనున్న 12వ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి సబ్‌ కలెక్టర్ కరోలిన్ చింగ్ థియాన్ మావిని ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ జి. కోటయ్య, అకాడమిక్ కోఆర్డినేటర్ సి. లింగమయ్య, ఎన్‌సీసీ అధికారి ఆర్. నాగేంద్ర, మధు తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page