TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్ : ఫిబ్రవరి 04
ప్ర‌జాగాయ‌కుడు గద్ద‌ర్ పేరుతో సినీ అవార్డులు ప్ర‌దానం చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించ‌డం త‌న‌కు ఎంతో ఆనందాన్ని కలిగించిందని, మెగాస్టార్ చిరంజీవి అన్నారు.

నంది అవార్డుల ప్రోత్సహం అనేది చాలా ఏళ్ళు అవుతోందని.. నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను ఇవ్వనుండటం శుభపరిణామమన్నారు.

ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతు న్నానని ఆయన అన్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో పద్మ అవార్డు గ్రహితలందరిని తెలంగాణ ప్రభుత్వం సన్మానించింది. పుర‌స్కార గ్ర‌హీత‌ల‌కు రూ.25 ల‌క్ష‌లు న‌గ‌దు రివార్డ్ అంద‌జేసింది.

ఈ సంద‌ర్భ‌గా చిరంజీవి మాట్లాడుతూ, పద్మ విభూషణ్ అవార్డు రావడం ఆనందంగా ఉందని.. గత వారం రోజులుగా అందరు వచ్చి అభిమానం చూపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు

మెగాస్టార్ చిరంజీవి. పద్మ అవార్డుల గ్రహితలను గౌరవిస్తూ.. తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. మనవాళ్లలను మనం గౌరవించకోకపోతే ఎలా అని అనుకోవడం గొప్ప విషయమన్నారు.

అవార్డులు ప్రకటించిన తర్వాత.. వెంటనే ఇలా సన్మానించడం ఇదే తొలిసారని.. అవార్డులు కళాకారులకు ఎంతో ప్రొత్సహాన్ని ఇస్తాయని చిరంజీవి అన్నారు. పద్మభూషణ్ వచ్చినప్పుడు ఉన్నంత సంతోషం.. పద్మవిభూషణ్ వచ్చినప్పుడు అంత ఉత్సాహం లేదన్నారు

చిరంజీవి. తాను అవార్డుల కోసం ఎప్పుడూ ఎదురు చూడను.. అవార్డులు రావాలని కోరుకోనన్నారు. తెలుగు సినిమాలు ప్రపంచ స్థాయికి చేరాయన్నారు.. సభ ఇంత నిండుగా ఉందంటే.. దానికి కారణం వెంకయ్య నాయుడు.. ఆయన తెలుగుతనానికి నిలువెత్తు నిదర్శనమని.. తెలుగు భాషను గొప్పగా నిలబెట్టిన వాళ్ళలో వెంకయ్య నాయుడు ఒకరని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.