
Nagababu Granted Cabinet Rank : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 10 ; జనసేన పార్టీ కీలక నాయకుడు ఎమ్మెల్సీ నాగబాబుకు రాష్ట్ర గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ పదవితో పాటు కేబినెట్ హోదా కల్పించారు. దీంతో ఆయన మంత్రులతో సమానంగా అధికారిక కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రోటోకాల్ తో పాటు జీతభత్యాలు కూడా లభిస్తాయి.
ప్రభుత్వం 2025 జనవరి 10 వ తారీకున జారీ చేసిన జీవో నెంబర్ 7 ప్రకారం నెలకు రూపాయలు రెండు లక్షల జీతం. సిబ్బంది మరియు ఇతర సౌకర్యాల కింద మరో రూపాయలు 2.5 లక్షలు, మొత్తం రూపాయలు 4.5 లక్షలు లభించనున్నాయి. మంత్రి పదవి ఆశించిన నాగబాబుకు కొన్ని సమీకరణాలవల్ల ఆ అవకాశం లేకపోవడంతో ఈ హోదా కల్పించినట్లు తెలుస్తోంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe