నవంబర్ 16, 2026
TRINETHRAM NEWS
Mutyala Rao

Mutyala Rao : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్: అక్టోబర్ 25; వె లేరుపాడు మండలం , మేడేపల్లి గ్రామపంచాయతీ ఆ మండల తెలుగుదేశం, జనసేన భారతీయ జనతా పార్టీ అనగా కూటమి బలపరిచిన సీ పి ఐ అభ్యర్థి కారం భవాని భర్త ముత్యాలరావు, అదేవిధంగా తాట్కూరు గొమ్ము కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి చింతల రమాదేవి, నార్లపురం, తిరుమలాపురం గ్రామ పంచాయతీల కూటమి బలపరిచిన జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి కొర్రి కౌశిక్ మాట్లాడుతూ, అత్యధిక మెజార్టీ ఓట్లతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఆయా పంచాయతీలలో ఎన్ని ఓట్లు ఉన్నాయో, వాళ్లకు పడతాయో తెలిపారు. ఓటు హక్కు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వాళ్ల యొక్క అమూల్యమైన ఓటు ముద్రను ఆ అభ్యర్థులకు కేటాయించిన ఎన్నికల గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీ ఓట్లతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని పేర్కొన్నారు. గెలిపిస్తే గ్రామాల అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని వెల్లడించారు.

దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో డబల్ ఇంజన్ సర్కార్ నడుస్తుందని సూచించారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సూపర్ సిక్స్ పథకాలు అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి అందాయని చెప్పారు. శాసనసభ్యులు చిర్రి బాలరాజు నాయకత్వంలో పోలవరం నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాలు అభివృద్ధి సంక్షేమం దిశగా ముందున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page