నవంబర్ 16, 2026
TRINETHRAM NEWS
Legislator Attends Church Anniversary

Legislator Attends Church Anniversary : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 26 ; జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలోని ఆర్.సి.యం చర్చి మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో పోలవరం డైనమిక్ శాసనసభ్యులు చిర్రి బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చి నిర్వాహకులు, క్రైస్తవ సోదరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ , వార్షికోత్సవ సందర్భంగా ఆ చర్చి సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

అయితే ఆ వార్షికోత్సవం ఆధ్యాత్మిక వాతావరణం లో నిర్వహించబడింది అని వెల్లడించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తమ్మన సాంబశివరావు , కోర్స దుర్గారావు, పద్ధం వెంకట కృష్ణ.చర్చి ఫాదర్లు, నిర్వాహకులు, స్థానిక ప్రజలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page