ప్రైవేట్ ఆసుపత్రిల దోపిడీకి అడ్డుకట్ట వెయ్యాలి.
సిపిఐ నియోజకవర్గం కార్యదర్శి ఉమా మహేష్.
Trinetham News : Medchal : సరూర్నగర్ కొత్తపేట్ అల్కానందా హాస్పిటల్ లో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ దోపిడీని నిరసిస్తూ నేడు సిపిఐ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఐడిపిఎల్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో మరియు నగరంలో ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటలు ప్రభుత్వాన్ని గాని, ప్రజలను కానీ లెక్కచేయకుండా ప్రతి చిన్న జబ్బుకు కూడా లక్షల రూపాయలు వసూలు చేసుకుంటూ ప్రజలను ఆర్థికంగా దోపిడీ చేస్తున్న సందర్భాలు నిత్యం మన ముందు కనిపిస్తూనే ఉన్నాయని , కానీ ప్రభుత్వము, ప్రభుత్వ అధికారులు ఆయా ఆస్పత్రి యాజమాన్యాల యాజమాన్యాలపై ప్రేమను చూపిస్తూ, మోసపోయిన ప్రజలను పట్టించుకోవట్లేదని , దాని పర్యావసరమే నేడు సరూర్నగర్ కొత్తపేట్ అలకానంద హాస్పిటల్లో కిడ్నీ దందాల వ్యవహారం వెలుగు చూసిందని,దీనికి ప్రధాన కారణం అధికారుల పర్యవేక్షణ లేకపోవడమేనని సిపిఐ నాయకులు అన్నారు. కావున ఇప్పటికైనా ప్రజలు కానీ, సంస్థలు కానీ ఆసుపత్రిలో జరిగిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొని వస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని లేకపోతే ఇలాంటి సంఘటనలే పునరావృతం అవుతాయని అన్నారు.
ప్రజల ప్రాణాలను కాపాడాల్సినటువంటి వైద్యులు ఆసుపత్రి యాజమాన్యాలు డబ్బు వ్యామోహంతో వారి విధులను నిర్వర్తించకుండా కేవలం డబ్బులు వసూళ్ల పైన దృష్టి పెడుతున్నారని కావున అన్ని ఆసుపత్రులను ప్రభుత్వం నియంత్రణలోకి తీసుకోవాలని సిపిఐ గా డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో అన్ని ప్రాంతాలలో ప్రైవేట్ ఆస్పత్రిలో చేస్తున్నటువంటి దోపిడీపై సిపిఐ గా పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు స్వామి, హరినాథ్,నరసయ్య, ఎమ్మెస్ రెడ్డి, ఇమామ్, వంశీ, సామెల్, యాదగిరి, మహేష్, మజ్జగిరి, కృష్ణ, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App