జూలై 26, 2026
TRINETHRAM NEWS
Mukundu Sivakrishna initiative to provide

Mukundu Sivakrishna : కూకట్పల్లి జూన్ 9 (త్రినేత్రం న్యూస్) : కుత్బుల్లాపూర్‌కు చెందిన దస్తగిరి ప్రమాదంలో తన కుడి కాలును కోల్పోయి చాలా కాలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవనం సాగిస్తున్నారు. రోజువారీ పనులు చేసుకోవడంలో కూడా కష్టాలు పడుతున్న ఆయన పరిస్థితిని తెలుసుకున్న తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరుగు శివకృష్ణ వెంటనే స్పందించారు. దస్తగిరికి అవసరమైన సహాయం అందించేందుకు భారత్ వికాస్ పరిషత్ వికలాంగుల పునర్వసతి కేంద్రం ట్రస్ట్‌ను సంప్రదించి, కృత్రిమ కుడి కాలు (ఆర్టిఫిషియల్ రైట్ లెగ్) అందేలా చర్యలు చేపట్టారు. శివకృష్ణ చొరవతో దస్తగిరికి కృత్రిమ కాలు అందడంతో ఆయన జీవితంలో కొత్త ఆశలు చిగురించాయి. ఇకపై రోజువారీ పనులను మరింత సులభంగా నిర్వహించుకునే అవకాశం లభించింది.

ఈ కార్యక్రమానికి కూకట్‌పల్లి న్యూ శక్తి దివ్యాంగుల సంఘం ప్రధాన కార్యదర్శి టి. చిరంజీవి, జవహర్‌నగర్ బలగంటి సీఈవో చింతల విజయ్ కుమార్, జినుక రఘు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కూకట్పల్లి భారత్ వికాస్ ట్రస్ట్ మేనేజర్ నరేంద్ర , సంధ్య, టెక్నీషియన్ రఘు, మధు, స్వామి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మెరుగు శివకృష్ణ మాట్లాడుతూ, సమాజంలో ఇంకా అనేక మంది దివ్యాంగులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. దాతలు ముందుకు వచ్చి పేద కుటుంబాలకు చెందిన దివ్యాంగులకు విద్య, ఉపాధి, వైద్యం, వివాహం వంటి అంశాల్లో ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన భారత్ వికాస్ ట్రస్ట్‌కు వికలాంగుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అవసరంలో ఉన్న ప్రతి దివ్యాంగుడికి అండగా నిలవడం మనందరి సామాజిక బాధ్యత అని మెరుగు శివకృష్ణ పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page