
Mudi Lingamayya : గుండ్లపల్లి( డిండి )సెప్టెంబర్ 21, త్రినేత్రం న్యూస్. గుండ్లపల్లి (డిండి )మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన ముడి లింగమయ్య ను దళిత జర్నలిస్టుల ఫోరం దేవరకొండ డివిజన్ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది.ఈ ఎన్నిక దళిత జర్నలిస్టుల ఫారం రాష్ట్ర అధ్యక్షులు కాశపోగు జాను, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ డేవిడ్ నియామకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముడి లింగమయ్య మాట్లాడుతూ దేవరకొండ డివిజన్ లోని దళిత జర్నలిస్టుల సమస్యల కొరకు పోరాడుతారని తెలియజేశారు.
దళిత జర్నలిస్టులు అందరిని కలుపుకొని ప్రతి మండలంలో కమిటీ వేస్తూ దళిత జర్నలిస్టుల ఫోరం కృషి కి పనిచేస్తానని తెలియజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe