ఆగస్ట్ 31, 2026
TRINETHRAM NEWS
illegal arrests.

కొర్ర చందు నాయక్. (జన సేన దేవరకొండ ఇన్చార్జి.

Illegal Arrests : దేవరకొండ డివిజన్ ఆగష్టు 10, త్రినేత్రం న్యూస్. తెలంగాణ ​ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగార్జునసాగర్ పర్యటన నేపథ్యంలో దేవరకొండ నియోజకవర్గ జనసేన పార్టీ ముఖ్య నాయకుడు చందు నాయక్ ను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేయడాన్ని జనసేన శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. ప్రభుత్వం తమ విఫల పాలనను, ప్రజల సమస్యలను కప్పిపుచ్చుకోవడానికే ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

–​ప్రధాన సమస్యలు & ప్రభుత్వ వైఫల్యాలు: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం సక్రమంగా అమలు కాకపోవడంతో వేలాది మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే పూర్తి బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
​ రాష్ట్ర కేబినెట్‌లో ఎంతోమంది లంబాడా/ఎస్టీ వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ, లంబాడా సామాజిక వర్గానికి తగిన ప్రాతినిధ్యం కల్పించకుండా కేబినెట్ మంత్రి పదవుల్లో తీవ్ర అన్యాయం చేశారు. “అరెస్టులకు, బెదిరింపులకు జనసేన భయపడదు”
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకే ప్రభుత్వం భయపడి ముందస్తు అరెస్టులకు పాల్పడుతోంది. లంబాడా/ఎస్టీ వర్గాల హక్కుల సాధన కోసం, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం జనసేన పార్టీ నిరంతరం పోరాడుతుంది అని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page