Trinethram News : భారత్, చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల ప్రాముఖ్యతను ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. బుధవారం న్యూస్ వీక్ మ్యాజగైన్కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు వివాదం కారణంగా తలెత్తే అన్ని వివాదాలను ఇరు దేశాలు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చైనాతో స్థిరమైన, శాంతియుత సంబంధాలు కేవలం రెండు దేశాలు లేదా ప్రాంతం మాత్రమే కాకుండా ప్రపంచ ప్రయోజనాల కోసం అవసరం అన్నారు ప్రధాని మోడీ.
ప్రధాని మోడీ. భారత్‌కు, చైనాతో సంబంధం ముఖ్యమైనది. దౌత్య సంబంధాలతో పాటు సైనిక బలోపేతానికి ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. సానుకూల వాతావరణం ద్వారా మన సరిహద్దులలో శాంతి, ప్రశాంతతను పునరుద్ధరించగలమన్నారు. దీనిని తాను ప్రగాఢంగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు.
ప్రజా మౌలిక సదుపాయాలను నిర్మించడంతోపాటు ప్రపంచ వ్యాపారాలను భారత్ తో ఎగుమతి, దిగుమతి చేసుకోవడంలో సమాయపడుతుందన్నారు. తూర్పు పొరుగు దేశంతో పోటీపడి దూసుకుపోతున్న భారతదేశంపై ప్రశంశల వర్షం కురిపించారు. ప్రస్తుతం గ్లోబలైజేషన్లో పెరుగుతున్న ప్రపంచ శక్తికి తమ వంతు సహకారం అందించేందుకు కలిసి వస్తుందన్నారు. దీనిని ఒక చైన్ లింక్ వ్యవస్థ ద్వారా వృద్ది చేయడం వల్ల వ్యాపారాలను విస్తరించాలనుకునే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు.
FDI నిబంధనలలో కొన్ని సడలింపులు ఇవ్వడం వల్ల పొరుగుదేశాలతో వ్యాపారం చేయడం సులభతరమైందని వివరించారు. ఫారిన్ ఇంపోర్ట్స్, ఎక్స్ పోర్ట్స్ నిర్వహణలో భారత్ గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు. భారతదేశంలో ఉత్పాదక సామర్థ్యాలను ఎలక్ట్రానిక్స్, సోలార్ మాడ్యూల్స్, వైద్య పరికరాలు, ఆటోమొబైల్స్‌తో సహా ఇలా 14 రంగాలకు విస్తరించామని చెప్పారు.