
Trinethram News : ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని షాపూర్ నగర్ కు చెందిన శివ శక్తి ధ్యాన యోగా మాస్టర్ పూర్ణ సాయి ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జనవరిలో తమిళనాడులో జరిగిన ఖేలో ఇండియా ఉమెన్స్ యోగాసన లీగ్ సౌత్ జోన్ పోటీలకు తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయ నిర్ణేతగా తెలంగాణ నుండి వెళ్లారు. తక్కువ వయసులో వెళ్లిన పూర్ణ సాయిని ఎమ్మెల్సీ అభినందించారు.
