
MLA Vijayaramana Rao fed sweets to the farmers to celebrate the farmer’s loan waiver
రైతుల పంటల బీమా పథకాన్ని అమలు చేస్తాం..
పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని పెద్దపల్లి శాసన సభ్యులు చింతకుంట విజయరమణ రావు వెల్లడించారు. రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీకి క్యాబినెట్ ఆమోదం తెలపడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తా వద్ద స్థానిక రైతులు మరియు కాంగ్రెస్ నాయకులతో కలిసి మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు.
ఆగస్టు 15లోగా రైతులందరికీ రూ.2 లక్షల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేసేందుకు
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రతిపాధనలు సిద్దం చేసిందని చెప్పారు.రుణమాఫీతో పాటు ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుల పంటల బీమా పథకాన్ని అమలు చేయబోతున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న పంటల బీమా కోసం రైతు నయా పైసా చెల్లించకుండానే పంటల బీమా పథకం అమలు కానున్నదని స్పష్టం చేశారు. వర్షాకాలం పండించే సన్న వడ్లకు మద్దతు ధరకు అదనంగా రూ.500 బోనస్ చెల్లిస్తామని తెలిపారు. పది సంవత్సరాలు క్రితం తెలంగాణ పేరిట అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కార్ విడతల వారీగా రుణమాఫీ తప్ప ఏక కాలంలో 2లక్షల రైతు రుణమాఫీ చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కుడా ఏక కాలంలో 2లక్షల రైతు రుణమాఫీ చేయలేదని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తన రాజీనామా పత్రాన్ని రెడీ చేసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరమణ రావు సూచించారు. రైతుల రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేస్తోందని,సవాల్‍ను హరీశ్ నిలబెట్టుకోవాలని అన్నారు.రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రూ.500కు వంటగ్యాస్ సిలిండర్,రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం, మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం వంటి హామీలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తూ గతంలో వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్నారు. రైతన్నలను రుణ విముక్తి చేస్తూ ఏకకాల రుణమాఫీకి శ్రీకారం చుడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జెడ్పీటీసీ బండారి రాంమూర్తి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు కడర్ల శ్రీనివాస్, పట్టణ కౌన్సిలర్లు నూగిళ్ళ మల్లయ్య, భూతగడ్డ సంపత్, తూముల సుభాష్ రావు, ఉప్పు రాజు, పాగాల శ్రీకాంత్, కొమిరిశెట్టి శ్రీకాంత్, సయ్యద్ మస్రత్, బొడ్డుపల్లి శ్రీనివాస్, సందనవేనీ రాజేందర్ యాదవ్, ఏడేల్లి శంకర్, మందల సత్యనారాయణ, బొడ్డుపల్లి జగదీష్, సర్వర్ పాషా, కొమ్ము శ్రీనివాస్, రమేష్, ఆర్కుటీ సంతోష్, కీర్తి రాజయ్య, గంగుల వెంకటేష్, గన్నమనేని తిరుపతి రావు, ఈర్ల స్వరూప, కొలిపాక శోభ, సంపత్, గుజ్జులా కుమార్, కొమ్ము అభిలాష్, దేవరకొండ రాజు, అస్లాం, ఆజ్గర్, తూముల శ్రీనివాస్, రైతులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ నాయకులు, సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు, మాజీ సర్పంచ్లు, ఉప సర్పంచులు, కాంగ్రెస్ అభిమానులు మరియు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
