MLA Venigandla Ramu : డ్రైనేజీల్లో జరుగుతున్న పనుల పురోగతిపై అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

తేదీ : 22/07/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుడివాడ అలసత్వానికి తావు లేకుండా డ్రైనేజీల మరమ్మతులు, ఇతర అభివృద్ధి పనులను వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నట్లు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. అదేవిధంగా రైతంగ ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా డ్రైనేజీల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని, డ్రైనేజీ శాఖ డి ఈ నాగేంద్ర కుమార్ ఏ.ఈ అనిల్ కుమార్ లు ఎమ్మెల్యే కు వివరించారు.

ఈ మేరకు గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో ఎమ్మెల్యే రామును సంబంధిత అధికారులు కలిసి వివరించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ తొంబై శాతం పైగా పనులు పూర్తయ్యాయని తెలిపారు. భారీ వర్షాల దృశ్య చంద్రయ్య ట్రైన్ లో ఉన్న గండ్లు పూడ్చాలని, అధికారులకు స్పష్టమైన సూచనలు చేశామని ఎమ్మెల్యే రాము చెప్పారు.ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, టిడిపి నేతలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA spoke to officials

You cannot copy content of this page

Scroll to Top