![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-08-at-7.58.55-PM.jpeg)
పార్టీ కోసం నిబద్ధతతో పని చేసే వారికి ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుంది ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
అల్లూరి జిల్లా త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 9 : వైఎస్సార్‌సీపీ డుంబ్రిగుడ మండల అధ్యక్షుడు గా నూతనంగా నియమితులైన పాంగి పరశురాం.ఆధ్వర్యంలో పాంగి పరశురాం, కి పార్టీ మండల అధ్యక్షుడు గా నియమించినందుకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కి కృతజ్ఞతలు తెలుపుతూ.. ఈరోజు పార్టీ మండల అధ్యక్షుడు పాంగి పరశురాం ఆధ్వర్యంలో డుంబ్రిగుడ మండల వైఎస్సార్‌సీపీ నాయకులు.
అరకు శాసన సభ్యులు రేగం మత్స్యలింగం మాస్టర్ ని ఘనంగా సన్మానించారు.ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ. పార్టీ కోసం నిబద్ధతతో పని చేసే పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుందని, రానున్న రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు మరింత సన్నాదాం కావాలని ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం,అన్నారు.
పాంగి పరశురాం మాట్లాడుతూ.. డుంబ్రిగుడ మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గా నియమించినందుకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కి, నన్ను నమ్మి బాధ్యత అప్పగించిన గౌరవ స్థానిక శాసన సభ్యులు శ్రీ రేగం మత్స్యలింగం కి పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని, అలాగే డుంబ్రిగుడ మండల వైఎస్సార్‌సీపీ నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ.
పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నిరంతరం అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కిముడు హరి, ఎంపిటిసిలు దళపతి తుమ్నాథ్ , శోభా రఘుపతి, మాజీ ఎంపిటిసి తాంగుల రాందాస్, మాజీ సర్పంచ్ పొట్టంగి రాంప్రసాద్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పాంగి నరసింగరావు, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు సాకెరి రాజారావు , హరిబారికి రాము నాయుడు, వంతాల గురు నాయుడు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![MLA Regam Matsyalingam](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-08-at-7.58.55-PM-1024x563.jpeg)