WhatsApp Image 2024 08 03 at 19.23.26
MLA Padi Kaushik Reddy’s challenge to Minister Dana Nagender?
Trinethram News : హైదరాబాద్:ఆగస్టు 03
ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా దమ్ముంటే మీరూ రావాలి అని మంత్రి దానం నాగేందర్ కు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, శనివారం సవాల్ విసిరారు.దమ్ముంటే ఎమ్మె ల్యే పదవికి రాజీనామా చేసి మాట్లాడాలని కౌశిక్ రెడ్డి అన్నారు.
దానం నాగేందర్ అసెంబ్లీలో దుర్భాషలాడారని, ఆయన హెచ్చరికలకు ఎవరూ భయ పడరని, మళ్లీ పాత రోజులు వస్తాయని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చెప్పారు. ఇవాళ కౌశిక్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దానం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని దమ్ముంటే రావా లని సవాలు విసిరారు.
దానం నాగేందర్‌కి కేసీఆర్ ఎమ్మెల్యే పదవిని భిక్షగా పెట్టారని తెలిపారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మాట్లా డాలని కౌశిక్ రెడ్డి అన్నారు.
కాగా, అసెంబ్లీలోనూ దానం నాగేందర్, కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వివాదం జరిగిన విషయం తెలిసిందే. బయట తిరగనివ్వబోమని దానం నాగేందర్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
తెలంగాణ మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని సీఎం రేవంత్ సిగ్గులేకుండా చెప్పు కుంటున్నారంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు.
మరో నాలుగు నెలల్లో 2 లక్షల ఉద్యోగాలను కాంగ్రెస్ సర్కారు ఇవ్వాలని, జాబ్ క్యాలండర్ అంటూ ప్రభు త్వం ఒక ప్రకటన విడుదల చేసిందని అన్నారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
