
– ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ !
MLA Nenavath Balu Naik : చింత పల్లి జులై 17,త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాల సొంతింటి కల నెరవేరుతోందని, ప్రతి అర్హ కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు.
చింతపల్లి మండల కేంద్రానికి చెందిన ఉపసర్పంచ్ శ్రీమతి రహేనా బేగం – సిద్ధిక్ బాబా దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సహకారంతో నాణ్యమైన ఇళ్లు నిర్మించి అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe