ఆగస్ట్ 18, 2026

WhatsApp Image 2024 11 21 at 2.31.07 PM

TRINETHRAM NEWS

ఇంటి అనుమతుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్…

Trinethram News : Medchal : ఈరోజు గాజుల రామారం సర్కిల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారులతో జరిగిన సమావేశంలో అనుమతుల విషయంలో టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ గాజులరామారం డివిజన్ పరిధిలో ఇంటి నిర్మాణాల అనుమతుల విషయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు నియమ, నిబంధనలను పాటించకుండా వక్ఫ్, దేవాదాయ శాఖల పేరు చెప్పి అనుమతులు ఇవ్వకుండా దరఖాస్తుదారులను ఇబ్బందులకు గురి చేయడం సరైన పద్ధతి కాదని, కోర్టు ఉత్తర్వులను పాటించకుండా చేద్దాంలే… చూద్దాం లే అనే ధోరణి వహించకుండా దరఖాస్తుదారులను ఇబ్బందులకు గురి చేయకుండా వెంటనే అనుమతులను ప్రారంభించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి, ఏసిపి రమేష్, టిపిఎస్ తుల్జా సింగ్, హెచ్ఐఎల్ కాలనీవాసులు అడ్వకేట్ కమలాకర్, చిన్న చౌదరి, అంజయ్య, వీరయ్య చౌదరి, తాహేద్, శ్రీనివాస్, పద్మనాభం తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page