MLA Jare : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్… 02.06.2025 – సోమవారం. అశ్వారావుపేట :తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అశ్వారావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు జారే ఆదినారాయణ ఈ రోజు అశ్వారావుపేట ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన అమరవీరులకు ఘనంగా, నివాళులు అర్పించారు రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలియజేశారు.
క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకలలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు అధికారులు మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మ రాంబాబు, అశ్వారావుపేట మండల నాయకులు ప్రమోద్, వేముల భారతి,సుంకవల్లి విరభద్రం, సత్యనారాయణ చౌదరి, అశ్వారావుపేట మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ నరదల మణికంఠ,అప్పలరాజు, మొదలైన తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Jare Adinarayana organized

You cannot copy content of this page

Scroll to Top