
MLA Holds Review Meeting : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 06 ; పోలవరం నియోజకవర్గం లోని ఏడు మండలాల తహసీల్దార్లతో డైనమిక్ శాసనసభ్యులు చిర్రి బాలరాజు బర్రింకలపాడు తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ,ఆయా మండలాల్లో రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు, పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యలు, భూ సంబంధిత అంశాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజల నుంచి వస్తున్న అర్జీలు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వాళ్లు
తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు, రెవెన్యూ సేవలు పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మండలాల వారీగా సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై తహసీల్దార్లకు ఆయన పలు సూచనలు చేశారు. ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe