
Anganwadi Celebration : కృష్ణాజిల్లా : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 06 ; పెడన నియోజకవర్గం, బంటుమిల్లి మండలం, బర్రిపాడు గ్రామం మండల పరిషత్ ఉన్నత పాఠశాల మరియు అంగన్వాడి కేంద్రంలో ఘనంగా అంగన్వాడి ఉత్సవం జరిగింది. ఈ కార్యక్రమాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకలో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు , తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు , అంగన్వాడి ఉపాధ్యాయురాలు , గర్భిణీ స్త్రీలు విద్యార్థుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ , అంగన్వాడి టీచర్లు, కార్యకర్తలు, పని మనుషులు చేసే అటువంటి వృత్తిని గురించి వివరించి క్లుప్తంగా చెప్పారు. వాళ్లకు వేతనం తక్కువ వస్తుందని, పెంచాలని పేర్కొన్నారు. వి అంకమ్మ, పడమటి లక్ష్మి, చిన్నమ్మలకు శాలువా కప్పి, పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సత్కరించారు. లడ్డు మిఠాయిలు పంచిపెట్టి, పండ్లు ఆ కార్యక్రమానికి వచ్చిన వాళ్లకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో టిడిపి గ్రామ అధ్యక్షులు వంకా వెంకటేశ్వరరావు (రోశయ్య), ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe