జూన్ 26, 2026
TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ అక్టోబర్ 07 త్రినేత్రం న్యూస్. గిన్నిస్‌ వరల్డ్ రికార్డు సాధించిన దేవరకొండ ‘ఆయుష్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా’ పున్న శ్రీజన్,మాకం అఖిల్, తుటిక జయ, సాయి కార్తిక్ విద్యార్థులకు నేడు దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే బాలునాయక్ తన నివాసంలో శాలువాతో సత్కరించి, అభినందించి,శుభాకాంక్షలు తెలిపారు.
“దేవరకొండ నియోజకవర్గం నుండి ప్రపంచ రికార్డు స్థాయిలో విజయాలు సాధించడం మనందరికీ గర్వకారణంఅని అన్నారు.. ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులు, అంకితభావంతో శిక్షణ ఇచ్చిన చైతన్య మాస్టర్ మన పట్టణానికి ఎంతో గౌరవాన్ని మరియు పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారు” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA congratulates students achieved Guinness World Record

You cannot copy content of this page