MLA Chinthakunta Vijayaramana Rao visited wards 24 & 25 in Peddapalli town
పెద్దపల్లి పట్టణంలో వార్డు సందర్శనలో భాగంగా ఈరోజు ఉదయం 24 మరియు 25 వార్డులలో పర్యటించిన ఎమ్మెల్యే విజయరమణ ఈ సందర్భంగా ఎమ్మెల్యే వార్డు ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. వార్డుల్లో అవసరం ఉన్నచోట డ్రైనేజ్, సిసి రోడ్లు మరియు శానిటేషన్ ఏర్పాటు చేస్తామని అన్నారు అలాగే వార్డు ప్రజలకు వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పలు మొక్కలు అందజేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 27 లక్షల మొక్కలు పెద్దపల్లి పట్టణంలో 1.25 లక్షల మొక్కలు నాటే విధంగా ప్రణాళిక రూపొందించడం జరిగింది అని నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిదని ఈరోజు మనం నాటిన మొక్కలు పెరిగి పెద్ద చెట్లు అయి అవి మనకు ఆక్సిజన్ అందించి మనం రోగాల బారిన పడకుండా ఎంతో దోహద పడతాయని అన్నారు
ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నాటిన మొక్కలను కళాశాల యాజమాన్యం విద్యార్థులు సంరక్షించాలని ప్రతి ఒక్క చెట్టు పైన ప్రభుత్వం వంద రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, వార్డు కౌన్సిలర్లు నూగిల్ల మల్లయ్య కార్తీక్ మేనేజర్ శివప్రసాద్,ఏఈ సతీష్ మరియు మెప్మా సిబ్బంది, విద్యుత్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
దివంగత నేత డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలలో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు వెలకట్టలేనివని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద మరియు సుల్తానాబాద్ పట్టణంలోని నెహ్రూ చౌరస్తా వద్ద దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులతో, కార్యకర్తలతో కలిసి పూలమాల వేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి నివాళులు అర్పించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణ రావు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి వారి ముఖంలో చిరునవ్వులు వెలిగించిన గొప్ప వ్యక్తి డాక్టర్.వైయస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందాలనే దేశంతో ఆసుపత్రులను అభివృద్ధి చేస్తూ 108 ను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీతో పాటు ఉచితంగా విద్యుత్ అందించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందని అన్నారు. ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొని ప్రజలకు సుపరిపాలన అందించిన మహానేతకు జోహార్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పట్టణ మరియు సుల్తానాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు ఉన్నారు.
పెద్దపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం రోజున ఇటీవల పట్టణ ప్రగతి నిధుల ద్వారా 45,35,325 /- లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన 5 ట్రాక్టర్లను మున్సిపల్ చైర్మన్ మరియు స్థానిక కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మరియు కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ కౌన్సిలర్లు,మేనేజర్ శివప్రసాద్,ఏ
ఈ సతీష్, మున్సిపల్ సిబ్బంది మరియు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App