
Trinethram News : రాజమహేంద్రవరం : ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటుతోనే కూటమి అభ్యర్ధి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపు సాధించడం ఖాయమని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమహేంద్రవరం నగరపాలకసంస్థ పరిధిలోని 41వ డివిజన్లో పరిశీలకులు బత్తుల తాతబాబు, బోళ్ల వెంకట కృష్ణ ప్రసాద్ లతో కలిసి విస్తృతంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల నివాసాలకు వెళ్లి కూటమి అభ్యర్థితో రూపొందించిన కరపత్రాన్ని పంపిణీ చేసి ఓట్లు అభ్యర్ధించారు.
ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటేనే తమకు న్యాయం జరుగుతుందని పట్టభద్రులు ఆలోచన చేస్తున్నారన్నారు. నిరుద్యోగులు, పట్టభద్రులకు ఇచ్చిన అన్ని హామీలను నేరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆయన వెంట టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్, నగర టీడీపీ ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకి రామయ్య, దినేష్, బుడ్డిగ రవి, స్థానిక టీడీపీ నాయకులు, మహిళలు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
