
మానవత్వం చాటుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఖమ్మం జిల్లా: జనవరి 02
ఖమ్మం జిల్లా రూరల్ మండలం చింతపల్లి అరెంపల వద్ద ఈరోజు ఉదయం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్షతగాత్రులను అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు.
వారి వివరాలు అడిగి తెలుసుకోవడంతో వారికి దైర్యం చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు. మెరుగైన వైద్యం అందిం చాలని చింతపల్లి వైద్యా శాఖ అధికారులకు ఫోన్ లో తెలిపారు.
