నవంబర్ 4, 2026
TRINETHRAM NEWS
Minister Kinjarapu Atchannaidu

Minister Kinjarapu Atchannaidu : గుంటూరు జిల్లా : అమరావతి, నవంబర్ 01 ; పులివెందుల పులినని గొప్పలు చెప్పుకునే గొడ్డలి పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గంలో ఓటు వేయకుండా వెనుదిరగడం ఆయన రాజకీయ పిరికితనానికి నిదర్శనమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో చోటుచేసుకున్న పరిణామాలపై స్పందించిన మంత్రి.. ప్రజల తీర్పును ఎదుర్కొనే ధైర్యం లేకనే జగన్ ఎన్నికల ప్రక్రియను వివాదాస్పదం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తి కనీసం తన ఓటు హక్కును వినియోగించుకోకుండా రాజకీయ నాటకాలకు తెరలేపడం సిగ్గుచేటన్నారు. ఇన్నాళ్లూ పులివెందులలో భయానక రాజకీయాలతో ఆధిపత్యం కొనసాగించిన వైసీపీకి ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్న ఎన్నికలను ఎదుర్కోవడం చేతకావడం లేదని మంత్రి విమర్శించారు. మహిళలు, వృద్ధులు, సామాన్య ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు ముందుకు వస్తుంటే వైసీపీ శ్రేణులు రాళ్ల దాడులు, బెదిరింపులతో భయోత్పాతాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజల మద్దతును పొందలేకపోతే హింసాత్మక వాతావరణం సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం జగన్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు.
పోలింగ్ సందర్భంగా వైసీపీ శ్రేణులు రాళ్ల దాడులు, ఘర్షణలు చోటుచేసుకోవడం, విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడులు జరగడం అత్యంత దురదృష్టకరమన్నారు. ఎన్నికల ప్రక్రియను చిత్రీకరించే మీడియా ప్రతినిధులపైనా దాడులు జరగడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతమని పేర్కొన్నారు. ఈ ఘటనల వెనుక ఉన్న వాళ్లను గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ కార్యకర్తలు ఓటర్లను అడ్డుకుంటున్నారనే ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరగాలన్నారు. హింసకు పాల్పడిన ఎంతటి వారైనా ఉపేక్షించరాదని స్పష్టం చేశారు. పులివెందుల అంటే జగన్ కుటుంబానికి రాజకీయ జాగీరు కాదని, అక్కడి ప్రజలు ఎవరి బానిసలూ కాదని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

ప్రజలను భయపెట్టి ఓట్లు పొందే రోజులు పోయాయని, ఆ భయం పట్టుకున్నప్పుడల్లా విధ్వంసం సృష్టించి ఇతరులపై నిందలు మోపడం వైసీపీ రాజకీయ అలవాటుగా మారిందని విమర్శించారు. ఒకవైపు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తతలు నెలకొంటుంటే మరోవైపు జగన్ రాజకీయ విన్యాసాలు ప్రదర్శించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజల తీర్పును గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. ప్రజల ముందుకు వెళ్లి వారి తీర్పును స్వీకరించే ధైర్యం జగన్ కు లేదని, ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తి ఓటు వేయకుండా వెనక్కి వెళ్లి ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్పడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. పులివెందులలో ఫ్యాక్షన్ రాజకీయాలకు కాలం చెల్లింది. ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలే తప్ప జగన్ కాదని గుర్తుంచుకోవాలి అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page