Medical colleges cannot be built overnight : Vidadala Rajini
Trinethram News Andhra Pradesh : రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టి, ఐదేళ్లలో ఐదు పూర్తి చేశామని మాజీ మంత్రి విడదల రజినీ తెలిపారు.
రాత్రికి రాత్రే అన్ని కళాశాలలను కట్టలేమని ఆమె చెప్పారు. ‘వందేళ్లలో కేవలం 11 కాలేజీలే కట్టారు.
అలాంటిది ఐదేళ్లలోనే ఐదు కట్టాం.
మరో ఐదు కాలేజీలు నిర్మాణదశలో ఉన్నాయి.
మిగతా కళాశాలలను కూడా కూటమి ప్రభుత్వం పూర్తి చేయాలి.
సర్కార్ ఆ దిశగా చర్యలు తీసుకోవాలి’ అని ఆమె పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App