Medical camp organized by Juvenile Welfare Correctional Service and Welfare of Street Children at U.F. W.C. MGM Hospital Dr.M. Yashaswini.
వరంగల్ జిల్లా
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ (పీపీ యూనిట్) వారి ఆధ్వర్యంలో వరంగల్ ఆటోనగర్ లోని జువెనైల్ వెల్ఫేర్ కరెక్షన్ సర్వీస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్స్ లో మెడికల్ క్యాంపు నిర్వహించి వారికి మందులు పంపిణీ చేసిన డాక్టర్.ఎం.యశస్విని. ఈ సందర్భంగా ఎం.జీ.ఎం. హాస్పిటల్ యు ఎఫ్ డబ్ల్యూ సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్.ఎం. యశస్విని విద్యార్థులందరికి మెడికల్ చెకప్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ యశస్విని మాట్లాడుతూ వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా చూసుకోవాలి, వేడి ఆహారం తీసుకోవాలని, ముఖ్యంగా గుడ్లు, పాలు మరియు బ్రెడ్ మొదలైనవి తీసుకుంటే ఆరోగ్యం హాయిగా ఉంటుందని స్టూడెంట్స్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ శ్రీదేవి, ఎం.జి.ఎం.హాస్పిటల్ హెచ్.వీ.నర్సమ్మ, రామ రాజేష్ ఖన్నా, ఆశా వర్కర్ నాగమణి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App