అక్టోబర్ 29, 2026
TRINETHRAM NEWS
Telugu Desam Party

Telugu Desam Party : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 29 ; చింతలపూడి నియోజకవర్గం,జంగారెడ్డిగూడెం మండలం, పుట్లగట్లగూడెం గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన 100 మందికి పైగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరారు. వాళ్లకు డైనమిక్ శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ , నియోజకవర్గ పరిశీలకులు రావి వెంకటేశ్వరరావు,జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి జగ్గవరపు ముత్తా రెడ్డి సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకొని తెలుగుదేశం పార్టీలోకి చేరారు.
ఈ సందర్భంగా వైసిపి ప్రధాన నాయకులు మల్లెపూడి రవి నేతృత్వంలో టిడిపి పార్టీ లోకి జాయిన్ అయినా ఎస్సీ కాలనీ ప్రజలు మాట్లాడుతూ,గత వైసీపీ ప్రభుత్వ పాలనలో తగిన గుర్తింపు, ఆదరణ లభించక విసిగిపోయామని తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, స్థానిక శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ కార్యకర్తలకు ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తున్న విధానం తమను ఎంతగానో ఆకర్షించిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సొంగా రోషన్ కుమార్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సరైన సమయంలో ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, ఆదరణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేస్తూ ప్రజాసేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కుక్కల మాధవరావు , ఉపాధ్యక్షులు గొల్లమందల శ్రీనివాసరావు , పుట్లగట్లగూడెం గ్రామ పార్టీ అధ్యక్షులు శీలం వెంకటరాజు కార్యదర్శి బూసా సత్యనారాయణ, జడ్పీటీసీ అభ్యర్థి శ్రీమతి గొల్లమందల సంకీర్తన ఎంపీటీసీ అభ్యర్థి శ్రీమతి మద్దిపాటి పల్లవి టీడీపీ నాయకులు శీలం కృష్ణంరాజు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page