Mancheryala DCP visited Addiction Center of Mancheryala Government Hospital
మంచిర్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం కమిషనరేట్ మంచిరాల జోన్ డిసిపి ఏ. భాస్కర్ మంచిర్యాల పట్టణంలోని జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ ను సందర్శించి, ఆవరణను పరిశీలించి, సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓ, డ్యూటీ వైద్యులతో మాట్లాడి అన్ని శాఖల, ప్రభుత్వం మత్తు పదార్థాల నిర్మూలనకు వ్యతిరేకంగా తీసుకుంటూ చర్యల్లో భాగంగా ముఖ్యంగా పునరావాస కేంద్రం (రెహాబిటేషన్ సెంటర్) పనితీరును అడిగితెలుసుకొన్నారు.
ఆసుపత్రి ఆవరణలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని సూపరింటెండెంట్‌కు సూచించారు. అదే విధంగా ఆసుపత్రిలో నిర్వహింస్తున్న పోలీస్ అవుట్ పోస్ట్ విధులు నిర్వహిస్తున్న అధికారులను 24 గంటలు అందుబాటులో ఉండేవిధంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సి.సి.టి.వి. కెమెరాల నిర్వహణ గురించి అధికారులకు తగు సూచనలు ఇవ్వడము జరిగింది.
డీసీపీ వెంట మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, పట్టణ ఇన్స్పెక్టర్ బన్సీలాల్ పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App