TRINETHRAM NEWS

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం స్థానిక 31వ డివిజన్ శివాజీ నగర్ లో జరిగింది ఈ యొక్క కార్యక్రమం గోదావరిఖని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మనాలి రాజ్ ఠాకూర్ మరియు నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొంతల రాజేష్ పాల్గొన్నారు వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేయాలని ధనా పేద తేడా లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరు సన్న బియ్యం తినాలని ఆకాంక్షతో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు అంతేకాకుండా రామగుండం నియోజకవర్గంలో స్థానిక రాజ్ ఠాకూర్ ప్రజల కోసం నిత్యం కష్టపడుతూ సంక్షేమ పథకాలు అమలయ్యే విధంగా చూస్తున్నారని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకొని యువతకు ఉపాధి మార్గాలు చూపాలని పవర్ ప్లాంట్ తీసుకురావడం జరిగిందని తెలియజేశారు మరియు వ్యాపార కేంద్రంగా మార్చాలని నగరంలో ఇరుకున ఉన్న రోడ్లతో జనం ఇబ్బందులు పడుతున్నారని రోడ్డు వెడల్పు కార్యక్రమాలు చేస్తూ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు పేద విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను తేవడమే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు అయ్యే విధంగా చూస్తున్నారని తెలిపారు రామగుండం ప్రజలు ఎమ్మెల్యే కి అండగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో కాలువ లింగస్వామి, రామాలయ కమిటీ చైర్మన్ గట్ల రమేష్, అడ్డాల స్వరూప రామస్వామి, ముస్తఫా, బొమ్మక రాజేష్, కొప్పుల శంకర్, సుతారి లక్ష్మణ్ బాబు, గడ్డం శేఖర్, డివిజన్ అధ్యక్షులు యాకూబ్, మిట్ట తిరుపతి, బొంతల లచ్చన్న, చొప్పరి శ్రీనివాస్,కల్వల అరుణ్, బాబు జానీ, గడ్డం వెంకటేశ్వర్లు, రాజు, పూసాల రాజేష్, శ్రావణ్ అరుణ్ మహిళా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శోభ తోపాటు డివిజన్ ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Manali Raj Thakur distributes