
మిలీనియం క్వటర్స్ స్థానిక సమస్యలను తక్షణమే పరిష్కరిస్తాం ఆర్జీవన్ జిఎం డి. లలిత్ కుమార్
సమస్యలపై స్పందించిన ఆర్జీవన్ జిఎం అధికారులకు కృతజ్ఞతలు తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు గంగానగర్ మిలీనియం క్వటర్స్ లో నివసిస్తున్న కార్మిక కుటుంబాలు అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మార్చి 23న సిఐటియు బస్తిబాట నిర్వహించింది వెంటనే రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి యజమాన్యంతో మాట్లాడి ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరిన మేరకు ఈరోజు ఆర్జీవన్ జిఎం డి, లలిత్ కుమార్ తో పాటు ఏరియా వర్క్ షాప్, సివిల్ డిపార్ట్మెంటు అధికారులు మిలీనియం క్వటర్స్ లో నివసిస్తున్న కార్మిక కుటుంబాలతో జిఎం చర్చించడం చర్చించారని వెంటనే స్పందించిన ఆర్జీవన్ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు, స్వచ్ఛమైన త్రాగునీరు లేక అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని వాటర్ పైప్ లైన్ లీకేజీల వల్ల నీళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్నారని విపరీతమైన చెట్లు పారిశుధ్యం లేక రోగాల బారిన పడవలసి వస్తుందని చూడడానికే సుందరంగా కనిపిస్తున్న ఈ బిల్డింగ్స్ వాటర్ లీకేజీలతో వర్షం వస్తే ఊరుస్తున్నాయని, పిల్లలు ఆడుకోవడానికి ఆటస్థలం ఆహ్లాదకరమైన పార్కు ఏర్పాటు చేయాలని తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు, కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మేదరి సారయ్య, ఆర్జీవన్ అధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి, తోట నరహరిరావు, పెరుమల్ల శ్రీనివాస్, సమ్మయ్య, కార్మిక కుటుంబ సభ్యులు పాల్గొన్నారు,
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
