TRINETHRAM NEWS

భగత్సింగ్ మేనల్లుడి పర్యటనను విజయవంతం చెయ్యండి.
సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కొత్తగూడెం ఎమ్ ఎల్ ఏ కూనంనేని సాంబశివరావు.

Trinethram News : ఈ నెల 26,27 తేదీలలో భగత్ సింగ్ మేనల్లుడు ప్రముఖ మార్క్షిస్ట్ ప్రొఫెసర్ జగమోహన్ సింగ్ సిపిఐ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనటానికి హైదరాబాద్ వస్తున్నారని కావున ప్రజలందరూ విజయవంతం చెయ్యాలని కోరుతు నేడు హిమాయత్నగర్ సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి తో కలిసి పోస్టర్ ను విడుదల చేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 80 యేండ్ల వయసుులో కూడా భగత్ సింగ్ మేనల్లుడు ప్రొఫెసర్ జగ్మోహన్ సింగ్ నేడు దేశంలో భగత్ సింగ్ ఆశయాలను ప్రజలకు తెలియచేయడానికి అనేక రాష్ట్రాలో సభలకు హాజరై భగత్ సింగ్ ఆశయాలను,అయిన కలలు కన్న దోపిడీ లేని సమసమాజ స్థాపన, మనిషిని మనిషిగా చూసే సమాజం కోసం ఎలా కలలుకన్నాడు,ప్రకటించిన మార్గాలు, 24 యేండ్ల వయసులోనే ఎలా దేశం కోసం ప్రాణాన్ని ఇవ్వడం కోసం సిద్ధమయ్యాడు,యువకులకు ఎలాంటి సందేశాలను ఇచ్చారు అనే అంశాలను ప్రచారం చేస్తూ నేటి తరం భగత్ సింగ్ నుండి ఎలా స్ఫూర్తి పొందాలో చెప్పుతున్నారని కావున అందరూ పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు.
ఈ నెల 26న హిమాయత్ నగర్లో,27 న కుత్బుల్లాపూర్ లో సభలు ఉంటాయని అన్నారు.
జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించకుండా క్షమాభిక్ష కోరిన వారిని బీజేపీ ఆర్ ఎస్ ఎస్ గొప్ప దేశ భక్తులుగా ప్రచారం చేస్తూ బలహీన మనస్తత్వాన్ని యువకుల్లో నూరిపోస్తున్న సందర్భంలో క్షమాభిక్ష అడిగితే ప్రాణాలు నిలుస్తాయని తెలిసినప్పటికీ దేశ స్వాతంత్రం కోసం,మాతృభూమి కంటే తన ప్రాణాలు ఎక్కువ కావని చెప్పిన అసలు సిసలు విప్లవకారుడు భగత్ సింగ్ అని ఇలాంటి వారి చరిత్ర ప్రజలకు తెలిస్తే విప్లవొకరులుగా మారి దేశాన్ని సమసమాజం వైపు తీసుకెళ్ళుతారని దాని వల్ల పెట్టుబడిదారి వర్గాలకు అన్యాయం జరుగుతుందనె భయంతో భగత్ సింగ్ చరిత్రను తొక్కిపడుతున్నారని అలాంటి వారి చరిత్ర చెప్పడానికి వస్తున్న జగ్మోహన్ సింగ్ పర్యటనను విజయవంతం చెయ్యాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాలానర్సింహా,సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఉమా మహేష్,అనిల్ కుమర్,ఏసురత్నం,యువజన సంఘం రాష్ట్ర నాయకులు శ్రీమాన్,వెంకటేష్,శ్రీనివాస్,రాజ్ కూమర్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App