TRINETHRAM NEWS

కనీస వేతన జీవోల సాధనకై 2025 మార్చి 6 న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయండి. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రాష్ట్రంలోని కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనాల జీవోలను సవరించి, కనీస వేతనం 26000/-రూ అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర కమిటీ 2025 మార్చి1-7 వరకు జరపతలపెట్టిన కనీస వేతనాల క్యాంపెయిన్ లో భాగంగా సిఐటియు అనుబంధ సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం (SCKS) ఆధ్వర్యంలో రామగుండం ఏరియా -1 లో ఈ రోజు ఉదయ్ నగర్ జోన్, సూర్యనగర్, జీ.ఎం.కాలనీ లలో కరపత్రాలు విడుదల చేసి,అడ్డా మీటింగ్స్ నిర్వహించడం జరిగింది.
ఈ అడ్డా మీటింగ్ కు ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్ హాజరై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడుతూ గత రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల జీ.ఓ.లను సవరించక పోవడంతో కార్మికులు కనీస వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చారని అన్నారు.

అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు ఆ హామీలు అమలు చేయలేదని ఆయన అన్నారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం నెలకు 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరుగు ధర్నాలో సింగరేణి కాంట్రాక్టు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కార్మికులను కోరారు ఈ కార్యక్రమంలో సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం రాష్ట్ర కార్యదర్శి వేల్పుల కుమారస్వామి, ఆర్జి-1అధ్యక్షకార్యదర్శులు నందిని,ఉపేందర్, ఉపాధ్యక్షులు రాజు, కార్మికులు దీక్ష కుమారి, రాజేశ్వరి,జయలక్ష్మీ, స్వరూప,మమత,జయ,సునీత,మరియమ్మ,
వెంకటేష్,పోషమ్మ,మీన,శారద,కోమురమ్మ,హరి,
శేఖర్,కొమురయ్య,
ఈశ్వర్,మల్లయ్య,
కృష్ణవేణి,రమణమ్మ,
ఆనంద్,కిరణ్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

dharna at collector's office