TRINETHRAM NEWS

వైద్యమిత్రాల సమస్యలను తక్షణమే పరిష్కరించండి. కాకినాడ,మార్చి,17: ఏపీ ఆరోగ్య మిత్ర కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడలో స్థానిక డిఎంహెచ్ఓ కార్యాలయం వద్ద శాంతియుతంగా వైద్యమిత్రాల సమస్యలు పరిష్కరించాలని నిరసన చేయడం జరిగింది.

ఈ నిరసనలో ముఖ్యఅతిథిగా వల్లూరి బంగారు శ్రీ, ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా అధ్యక్షులు వనచర్ల వీరభద్రరావు, AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ లు మాట్లాడుతూ ప్రభుత్వాలు వైద్య సేవలో ప్రవేశపెట్టిన అన్ని పథకాలు ప్రజలకు చేరేందుకు కీలకపాత్ర వహిస్తున్న ఆరోగ్య మిత్రుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, పెరుగుతున్న అధిక ధరలకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం కనీస వేతనాలు 35 వేల రూపాయలు మంజూరు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రిటైర్మెంట్, మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ప్రమాదాల్లో, అనారోగ్యాల్లో మృతి చెందిన మిత్రులకు 15 లక్షలు ఎక్స్ గ్రేషియా మంజూరు చేయాలని, సుమారు17 సంవత్సరాలుగా పనిచేస్తున్న వారందరి సీనియారిటీని బట్టి సర్వీస్ స్కేల్ పెంచి జీతాలు మంజూరు చేయాలని, ఎన్టీఆర్ వైద్యమిత్రాలను తక్షణమే పర్మనెంట్ చేయాలని వారన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, మాకు మంచి జరుగుతుందని, మంచి ప్రభుత్వం వచ్చిందని మేము ఆశిస్తున్నామని వారు అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్నిసంక్షేమ పథకాలు ఎన్టీఆర్ ఎన్టీఆర్ వైద్యమిత్రాలకు వర్తించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని వారన్నారు.

ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మా సేవలను గుర్తించి మా ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మాకు ఉద్యోగ భద్రత కల్పించి, జీతాలు పెంచి మా కుటుంబాలను ఆదుకోవాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎండి ఖాజా మొహిద్దిన్, బీరుద. వీరబాబు, ఏ.దుర్గాప్రసాద్, తులసీదేవి,కే. సత్యవతి, యామిని కృష్ణ, అనిల్ కుమార్ తదితరలు జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉన్న వైద్య మిత్రాలు అందరూ పాల్గొన్నారు. వైద్య మిత్రులకు మద్దతుగా ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సెక్యూరిటీ గార్డ్ వర్కర్స్ యూనియన్ రామయ్య, అనిల్ మద్దతు తెలియజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Make NTR Vaidyamitras permanent