జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 31 at 20.26.40

TRINETHRAM NEWS

పోతుగంటి బొందాలు ఆఖరి మజిలీ యాత్ర కు సహకారం అందించిన సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్ చైతన్యపురి కాలనీకి చెందిన పోతుగంటి బొందాలు 80 సంవత్సరాల వృద్ధుడు గురువారం సాయంత్రం మరణించినట్లు స్థానికులు తెలిపారు వృద్ధుని అంతక్రియలు శుక్రవారం జరుగుతుండగా అంతిమ యాత్రకు సహాయం కావాలని సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ కు ఫోన్ ద్వారా తెలుపగా పాడేకు సంబంధించిన సామాన్లు చైతన్యపురి కాలనీలోని మృతుని ఇంటి వద్దకు పంపించారని స్థానికులు తెలిపారు చైతన్య పూరి కాలని ప్రజలు మాట్లాడుతూ కరోన కష్ట కాలం నుండి మేము ఏ సహాయం అడిగిన చేస్తున్నారని మా డివిజన్లో ఏ పేదవారు చనిపోయిన మొదటిగా మాకు గుర్తుకు వచ్చే పేరు మడిపెల్లి మల్లేష్ అన్న అని మేము ఎప్పుడు ఎ సహాయం కోరిన కాదనకుండా మా డివిజన్ పేద ప్రజలకు సహాయం ఆదిస్తున్నరని మా డివిజన్ అనే కాకుండా రామగుండం నియోజకవర్గ పరిధిలో ఎ పేదవారు ఫోన్ చేసి సహాయం కొరగానే వెంటనే స్పందించి వారికి సహాయం అందిస్తున్నారని ఈ సందర్భంగా మడిపెల్లి మల్లేష్ అన్నకు మరియు సేవా స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులందరికీ రామగుండం ప్రజల తరపున మరియు మా 14వ డివిజన్ తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని డివిజన్ ప్రజలు తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page