
ఉదయం 5 గంటలకు, మధ్యాహ్నం ఒంటి గంటకు
ఏప్రిల్ 1 నుంచి అమలు
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి నాలుగు లైన్ల జాతీయ రహదారి చెంతనున్న అంతర్రాష్ట్ర కూరగాయల మార్కెట్ వేళలను మార్పు చేసినట్లు ఆ మార్కెట్ కమిటీ అధ్యక్షులు పాలూరి సత్తిబాబు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉదయం 5 గంటల నుంచి ఈ మార్కెట్లో కొనుగోలు అమ్మకాలు జరుగుతాయి. అలాగే మధ్యాహ్నం ఒంటిగంట నుంచి తిరిగి మార్కెట్ ప్రారంభం అవుతుంది. రోజుకు రెండు సార్లు ఈ మార్కెట్ నిర్వహించబడుతుంది. ఈ మారిన వేళలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని సత్తిబాబు తెలిపారు. ఈ వేళలు పాటించకుండా రైతులు లేదా వ్యాపారాలు మార్కెట్లో అమ్మకాలు,కొనుగోలు చేస్తే రూ.2 వేలు జరిమానా విధిస్తున్నట్లు వారు హెచ్చరించారు. ఇప్పటివరకు ఈ మార్కెట్లో వేలాపాల లేకపోవడం వల్ల అటు రైతులకు ఇటు కొనుగోలుదారులకు సమన్వయం కుదరక ఇరువురికి నష్టం వాటిల్లుతుంది. ఈ విషయాన్ని గుర్తించిన మార్కెట్ కమిటీ వారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఈ మార్కెట్ కు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కూరగాయలను రైతులు తీసుకొస్తారు. అలాగే వీటికి కొనే వ్యాపారస్తులు కూడా వివిధ జిల్లాలు, దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. ఖచ్చితమైన సమయాలు ఇప్పటివరకు పాటించకపోవడం వల్ల రైతుల ఎప్పుడు కూరగాయలు తేవాలో కొనుగోలుదారులు ఎప్పుడు రావాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. అందుకనే ఈ సమయాలను నిర్ణయించామని ఆ సమయాల్లోనే అమ్మకాలు కొనుగోలు జరుగుతాయని మార్కెట్ కమిటీ అధ్యక్షులు సత్తిబాబు వివరించారు.దూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులు,వ్యాపారస్తులు ఈ మారిన వేళలను గుర్తించాలని ఆయన సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
