మాదిగలు రాజకీయాలకు అతీతంగా ఏకం కావాలి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ మే 19 ధర్మసాగర్ మండల కేంద్రంలోని స్థానిక ఎస్సీ కమ్యూనిటీ హాల్ నందు ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ విభాగాల మండల స్థాయి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది దీనికి మండల ఇన్చార్జ్ జేరిపోతుల సుధాకర్ మాదిగ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన రాగల్ల ఉపేందర్ మాదిగ మాట్లాడుతూ మాదిగల చిరకాల ఆకాంక్ష ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను సాధించడం మంద కృష్ణ మాదిగ ప్రజా ఉద్యమ పోరాటాలకు గుర్తుగా దేశ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ అవార్డును భారత ప్రభుత్వం ప్రకటించడం మన జాతికే కాదు సబండ వర్గాలకు ప్రజల కోసం పోరాటం చేసే ఉద్యమకారులకు గర్వకారణమని, కృష్ణ మాదిగ నలబై ఏళ్ల నిస్వార్థ ప్రజా ఉద్యమ జీవితానికి నిదర్శనమని అన్నారు
అంబేద్కర్ గారు రిజర్వేషన్లను తీసుకువస్తే, ఆ తెచ్చిన రిజర్వేషన్లను అందరికీ పంచి చరిత్రకి ఎక్కాడని అందుకే రిజర్వేషన్ల అనే నాణానికి డాక్టర్ అంబేద్కర్ గారు ఒకవైపు అయితే మరొకవైపు మందకృష్ణ మాదిగ అన్నారు సమాజ మద్దతుతో సుదీర్ఘ కాలం పాటు ఉద్యమం నడిపి విజయం సాధించాం ఎస్సీ రిజర్వేషన్ల ఫలాలను ప్రజలకు అందించాం ఇగ సమాజంలోని అన్ని వర్గాల శ్రేయస్సు కోసం నిబద్దతతో నిలబడదామని అందుకోసం ఎమ్మార్పీఎస్ మరియు అన్ని అనుబంద విభాగాలను పునర్నిర్మానం చేస్తూ రాజకీయాలకతీతంగా జాతి యావత్తును ఏకం చేయాలని, ప్రమాదంలో పడుతున్న మాదిగల అస్తిత్వాన్ని రాజకీయ ప్రాతినిధ్యాన్ని కాపాడుతూనే మన శక్తిని చాటుకునేలా ఐక్యంగా నిలవాలని అన్నారు
పద్మశ్రీ అవార్డు సందర్భంగా స్టేషన్గన్పూర్ కేంద్రంగా మన నాయకున్ని ఆత్మీయంగా ఘనంగా సత్కరించుకోవాల్సిన అవసరం ఉన్నదని అందుకోసం స్టేషన్గన్పూర్ నియోజకవర్గ కేంద్రంగా త్వరలో మందకృష్ణ మాదిగ ఆత్మీయ అభినందన సభను నిర్వహిస్తున్నామని అందుకోసం గ్రామాలను దండోరా ఉద్యమ కేంద్రాలుగా మార్చి ఉద్యమాన్ని శాస్త్రీయంగా సైదాంతికంగా నిర్మాణాత్మకంగా బలోపేతం చేయాలని నాయకులు ప్రజల్లో ఉంటూ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు అన్ని వర్గాల శ్రేయస్సు కోసం ఉద్యమించాలని కోరారు
ఈ కార్యక్రమంలో ఎంఎస్పి హనుమకొండ జిల్లా అధికార ప్రతినిధి గంగారపు శ్రీనివాస్ మాదిగ, జనగామ జిల్లా అధికార ప్రతినిధి సందేన రవీందర్ మాదిగ ఎమ్మార్పీఎస్ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శాంతి సాగర్ మాదిగ ఎంఎస్ప్ మండల అధ్యక్షులు ఎండి శంషుద్దీన్, ఎమ్మార్పీఎస్ మండల నాయకులు పుట్ట ప్రణయ్ మాదిగ మండల ఉపాధ్యక్షులు సింగారపు పవన్ మాదిగ,బొడ్డు ప్రణయ్ మాదిగ, గొల్లపేల్లి అనిల్ మాదిగ,కొట్టే శంకర్ మాదిగ, పోలుమారి బాబు మాదిగ, బొడ్డు శ్రావణ్ కుమార్ మాదిగ, కొట్టే విజయభాస్కర్ మాదిగ, నక్క శీను మాదిగ, మాచర్ల పౌలు మాదిగ, నక్క సంజయ్ మాదిగ, కొట్టే వినయ్ తేజ్ మాదిగ, కొట్టే రాఖీ మాదిగ, సింగారపు దిలీప్ మాదిగ తదితరులు పాల్గొన్నారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Madigas should unite beyond

You cannot copy content of this page

Scroll to Top