అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు అక్షరాభ్యాసం కార్యక్రమం
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని, 25వ డివిజన్ చంద్రబాబు కాలనీలో ని, అంగన్వాడి కేంద్రంలో సోమవారం వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ లయన్ డాక్టర్ సురభి శ్రీధర్ ఆధ్వర్యంలో పిల్లలకు అక్షర అభ్యాసం కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంస్థ అధ్యక్షులు పెద్దంపేట్ శంకర్ గౌడ్, సంస్థ ప్రధాన కార్యదర్శి లయన్ డాక్టర్ చింతలపల్లి కిషన్ రావు, ఏఎస్ఐ డాక్టర్ బాయ్ శ్రీనివాస్ హాజరై పిల్లలకు అక్షర అభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అతిధులు మాట్లాడారు. అంగన్వాడి కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న టీచర్లు, ఆయలు అందిస్తున్న సేవలు వెలకట్టలేమని అన్నారు.అంగన్వాడీ కేంద్రంలో రెండు సంవత్సరాలు దాటిన పిల్లలను చేర్పించినట్లు అయితే పిల్లలను అన్ని రకాల ఎదుగుదల ఉంటుందన్నారు.
ఇంగ్లీషు బోధన ఎల్కేజీ యూకేజీ విద్యను , మూడు సంవత్సరాల పిల్లలకు ఎల్కేజీ నాలుగు సంవత్సరాల పిల్లలకు యూకేజీ విద్యను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అంగన్వాడీ కేంద్రాలలో అందించడం జరుగుతుందని, ఒక పూట సంపూర్ణ భోజనం తో పాటు పిల్లలకు సాయంత్రం 4 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలలో విద్యను అందించటం జరుగుతుంది అని తెలిపారు అందరూ తమ తమ చిన్న పిల్లలను అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించాలని వారు కోరారు
ఈ కార్యక్రమంలో అల్లురి సెక్టార్ సూపర్వైజర్ మమత, అంగన్వాడి టీచర్ బి. భాగ్యలక్ష్మి ,ఆయా ఎల్.ఆర్ ఈశ్వరి తోపాటు పిల్లల, తల్లులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App