TRINETHRAM NEWS

We will see an end to encroachments – Hydra-style system in AP too: Minister Narayana

భవిష్యత్​లో వరదల వల్ల విజయవాడ నగరం మునిగిపోకుండా ఉండేలా ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటుందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వివరించారు.

కృష్ణానదిపై మరో బ్యారేజీ నిర్మించడం సహా బుడమేరు డైవర్షన్ పనులు సత్వరం పూర్తి చేయాలని సీఎం నిర్ణయించారని పేర్కొన్నారు.

ఆ పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు చెప్పారు.

అదేవిధంగా తెలంగాణలో హైడ్రా తరహాలోనే ఆపరేషన్ బుడమేరు పేరిట ప్రత్యేక కార్యక్రమం వీలైనంత త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.

విజయవాడలో బుడమేరు కాలువతోపాటు ఆంధ్రప్రదేశ్​లోని మిగతా ప్రాంతాల్లోనూ నీటి వనరుల ఆక్రమణలపై సర్వే ప్రారంభమవుతుంది.

ఇందుకోసం అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనున్నాం.

వరదనీటి కాలువల వెడల్పు ఎంత?

అవి ఎంతవరకు ఆక్రమణలకు గురయ్యాయి?

ఆక్రమిత ప్రాంతంలో ఎన్ని నిర్మాణాలు ఉన్నాయి?

వాటిలో పేదలవి ఎన్ని?

పెద్దలకు చెందినవి ఎన్నో గుర్తిస్తాం.

సమగ్ర నివేదిక రూపొందించి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటాం…. మంత్రి నారాయణ

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

We will see an end to encroachments - Hydra-style system in AP too: Minister Narayana