TRINETHRAM NEWS

విప్లవకారుల ఐక్యతతో ప్రజా ఉద్యమాన్ని బలోపేతం చేద్దాం!

ఎడ్ల రవికుమార్. సిపిఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ టౌన్ నాయకులు.

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈనెల 28వ తారీఖున హైదరాబాద్. లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ రెండు పార్టీల విలీన సభ జరుగుతుంది విలీన సభను న్యూ డెమోక్రసీ పార్టీ శ్రేణులు విప్లవ అభిమానులు అందరూ సభకు హాజరై జయప్రదం చేయాలని కోరుతూ గోదావరిఖని గంగానగర్ లో పోస్టల్ ఆవిష్కరణ చేయడం జరిగింది.
కార్యక్రమం లో సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ పార్టీ టౌన్ నాయకులు ఎడ్ల రవికుమార్. మాట్లాడుతూ దేశంలోని విప్లవకారులందరూ ముఖ్యం కావాలని ప్రజల పక్షాన పోరాడే రెండు న్యూ డెమోక్రసీ పార్టీలు ఈనెల 28న హైదరాబాదులో సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో విలీన సభ జరుగుతుందని సభను జయప్రదం చేయాలని విప్లవ పార్టీల ఐక్యతతో బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించవచ్చని అన్నారు. యొక్క విలీన సభ ను జయప్రదం చేయాలని విప్లవ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లో పార్టీ నాయకులు తిప్పని రాంకీ, ఐ ఎఫ్ టీ యు నాయకులు ముచ్చకోళ్ల బాలకృష్ణ, ఎడ్ల రాజ్ కుమార్ , ఎం మైపాల్, వి శ్రీనివాస్, జె లక్ష్మణ్, శ్రీకాంత్, జగన్, గట్టయ్య, పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App