
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: వికారాబాద్ జిల్లా కేంద్రము: రెండు రోజులు క్రితం ఓ న్యాయవాది ని అతి దారుణంగా హత్య చేసిన ఘటన ను నిరసిస్తూ వికారాబాద్ జిల్లా కోర్టు న్యాయవాద సంఘము అధ్యక్షులు అశోక్ కుమార్ అధ్వర్యంలో సీనియర్ మరియూ జూనియర్ న్యాయవాదులు పాల్గొని దారుణాన్ని ఖండించారు. న్యాయవాదులు విధులను బహిష్కరించి పెద్ద ఎత్తున నిరసనలు చేశారు.
న్యాయవాదుల పై దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదుల పరిరక్షణ కు పటిష్ట మైన చర్యలు తీసుకోవాలని అందులో భాగంగా న్యాయవాదుల కు రక్షణ కల్పించేలా ప్రత్యేక చట్టాలు తేవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం వికారాబాద్ బార్ న్యాయవాదులు పాలుగోన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
