
భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన మండల పరిషత్. సీనియర్ అసిస్టెంట్ శివానందం.
డిండి (గుండ్లపల్లి) ఏప్రిల్ 5 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నేడు మాజీ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ శివానందం మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన సంఘ, స్వాతంత్ర్య సమరయోధులు, భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పోలం సురేష్ ,శివాజీ ,అజయ్, రామస్వామి మరియు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
