Kumari aunty donated Rs.50 thousand
వరద బాధితుల సహాయార్థం సీఎంకు చెక్కు అందజేత
రేవంత్‌కు రొయ్యలు, నాటుకోడి కూర ఇచ్చిన కుమారి
Trinethram News : రోడ్డు పక్కన చిన్న షెడ్డులో హోటల్ నడుపుతూ పేరు తెచ్చుకుని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన కుమారి అలియాస్ కుమారీ ఆంటీ తన పెద్దమనసును చాటుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వరద బాధితుల సహాయార్థం రూ.లక్ష విరాళం ప్రకటించారు. బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసిన కుమారి కుటుంబం రూ.50వేల చెక్కును అందించింది. సీఎం రేవంత్ ఆమెను అభినందించి, శాలువాతో సన్మానించారు. కుమారి హైదరాబాద్‌లోని రాయదుర్గం ఐటీ హబ్ ప్రాంతంలో నడుపుతున్నారు.
ఆమె కుటుంబానికి ఆ హోటలే జీవనాధారం.కాగా సీఎంకు ఆమె రొయ్యల వేపుడు, నాటుకోడి, చేపల కూర, మటన్ కర్రీ, బిర్యానీ అందజేశారు. గతంలో తన హోటల్‌ను తీసేయాలని పోలీసులు చెప్పినప్పుడు తమకు సీఎం అండగా ఉన్నారని ఆమె గుర్తు చేసుకున్నారు. ఏపీ పెద్దలకు సమాచారం అందించామని, వారి నుంచి పిలుపు రాగానే వెళ్లి రూ.50వేల చెక్కు అందిస్తామని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App