జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 21 at 3.37.52 PM

TRINETHRAM NEWS

భక్తులతో కిటకిటలాడిన కొమురవెల్లి మల్లన్న ఆలయం

హైదరాబాద్‌ : భక్తుల కొంగుబంగారం కొమురవెల్లి(Komuravelli) శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం(Mallanna temple) భక్తుల(Devotees)తో కిటకిటలాడింది. మల్లన్న దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు.

స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కాగా, నేటి ఆదివారంతో మొదలై 8 ఆదివారాలపాటు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగాయి.

ఇందుకోసం ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. నేడు పట్నంవారం(Patnam varam) నిర్వహించనున్నారు.ఈ వేడుక కోసం శనివారమే హైదరాబాద్‌ ప్రాంత భక్తులు భారీగా తరలివచ్చారు. గదులు దొరక్క కొందరు భక్తులు వచ్చిన వాహనాల్లోనే సేదతీరుతున్నారు. కొందరు ఖాళీ ప్రదేశాల్లో గుడారాలు ఏర్పాటు చేసుకొన్నారు.

సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ అనురాధ ఆధ్వర్యంలో భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ తోటబావి సమీపంలో ఎడమవైపు ఉన్న కాంపౌండ్‌ వాల్‌ ప్రదేశంలో వీఐపీ పార్కింగ్‌, సిద్దిపేట, చేర్యాల, కిష్టంపేట, కొమురవెల్లి కమాన్‌ నుంచి వచ్చే వాహనదారులు బస్టాండ్‌ పక్కన పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌, కొండపోచమ్మ టెంపుల్‌, ఐనాపూర్‌ నుంచి వచ్చేవారికి కొమురవెల్లి పెట్రోల్‌ పంపు వెనుక ఖాళీ ప్రదేశంలో పార్కింగ్‌కు అవకాశం కల్పించారు.

You cannot copy content of this page