TRINETHRAM NEWS

Trinethram News : పతనంతిట్టా శబరిమల :

శబరిమలకు పెరిగిన భక్తుల తాకిడి.. దర్శన వేళలు పొడిగింపు

కేరళలోని శబరిమలకు భక్తుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో అయ్యప్ప దర్శనం వేళలు గంట పొడిగిస్తూ ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ) ఆదివారం నిర్ణయం తీసుకుంది.

సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు ఉన్న దర్శన వేళలను గంట పెంచింది.