TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్ : లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.రేపు సుప్రీంకోర్టులో కవిత కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.
తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ ఆమె తరఫున భర్త అనిల్ పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. తనను అరెస్ట్ చేయవద్దనే ఆదేశాలున్నా, ధిక్కరించి ఈడీ అరెస్ట్ చేసిందని కవిత తన పిటిషన్లో పేర్కొననున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తరఫున కపిల్ సిబాల్, రోహత్గా కోర్టులో వాదించనున్నారు. కాగా, ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత తొలిరోజు విచారణ కాసేపటి క్రితం ముగిసింది. విచారణలో భాగంగా కవిత చెప్పిన సమాధానాలను అధికారులు రికార్డు చేశారు.లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి పలు అంశాలపై ఆమెను ప్రశ్నించారు. విచారణ అనంతరం ఆమెను భర్త అనిల్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ,ప్రశాంత్ రెడ్డి కలిశారు. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.అలాగే అరెస్ట్ విషయంలో న్యాయపరంగా ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై చర్చించారు.