మంగళగిరి రేసులో నేనున్నా.. కొత్త వాళ్లకి సీటు కావాలంటే కుదరదు: కాండ్రు కమల
అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి (Mangalagiri) ఎమ్మెల్యే పదవికి, వైకాపా సభ్యత్వానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) రాజీనామా చేయడంపై మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమల (Kandru Kamala) స్పందించారు..
రాజీనామా చేయడం ఆయన వ్యక్తిగత అంశం అన్నారు. ఆర్కే రాజీనామా పార్టీకి తీవ్ర నష్టమన్నారు..
”సీఎంకు ఆర్కే సన్నిహితుడు కాబట్టి.. ఆయనతో కూర్చొని మాట్లాడుకుంటే బాగుండేది. ఆర్కే గెలిచాక ఒక నెల మాత్రమే మాతో సఖ్యతగా ఉన్నారు. ఆ తర్వాత కార్యక్రమాలకు మమ్మల్ని దూరం పెట్టారు. పార్టీ పరువు తీయకూడదనే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నా. ఈ విషయం అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాను. ఆర్కే గెలుపు విషయంలో నా కృషి చాలా ఉంది. నా వల్లే ఆయనకు మెజార్టీ వచ్చింది. నేను కూడా మంగళగిరి నుంచి ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉన్నా. కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్లు సీటు కావాలంటే కుదరదు. అధిష్ఠానం నిర్ణయం మేరకు నా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తా” అని కాండ్రు కమల తెలిపారు..