
రాజమహేంద్రవరం: 1991 బ్యాచ్ కు చెందిన కె.వి. సత్యనారాయణ తూర్పుగోదావరి జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా, కాకినాడ ట్రాఫిక్ డిఎస్పీగా, రాజమహేంద్రవరం ఎస్.బి డిఎస్పీగా, ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీగా మరియు పరవాడ సబ్ డివిజన్ పోలీస్ అధికారిగా ఆయన గతంలో పనిచేశారు. రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన ఇక్కడకు బదిలీపై వచ్చారు.
ఈ సందర్భంగా డీఎస్పీ కె.వి. సత్యనారాయణ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన శక్తి యాప్ పై జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విస్తృత అవగాహన కల్పిస్తామని తెలిపారు. మహిళలు మరియు బాలికలు తమ మొబైల్ ఫోన్లలో ఈ యాప్ ను ఇన్స్టాల్ చేసుకునేలా చర్యలు తీసుకుంటామని, తద్వారా వారిపై జరిగే నేరాలను అరికట్టవచ్చని ఆయన అన్నారు. మహిళల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హామీ ఇచ్చారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
